21 May, 2026 | 3:15 AM

కొప్పూర్ గ్రామానికి ఫ్రీజర్ బాక్స్ విరాళం

21-05-2026 02:10 AM

భీమదేవరపల్లి, మే 20 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామంలో మానవీయ విలువలను ప్రతిబింబించే సేవా కార్యక్రమం బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన కొమ్ముల సుగుణవీరస్వామి జ్ఞాపకార్థం గ్రామ ప్రజల అవసరార్థం యువ దాతలు ప్రదీప్, ప్రణయ్ ఫ్రీజర్ బాక్స్ను గ్రామానికి విరాళంగా అందజేశారు. కార్యక్రమం అందరి ప్రశంసలు అందుకుంది.

గ్రామీణ ప్రాంతాల్లో మృతదేహాలను భద్రపరచేందుకు సరైన సదుపాయాలు లేక కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్న సందర్భాలను దృష్టిలో పెట్టుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ ఫ్రీజర్ బాక్స్ను అందజేసినట్లు దాతలు తెలిపారు. 

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రజలకు ఉపయోగపడే సేవ చేయడం గొప్ప విషయమని గ్రామ పెద్దలు కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కొప్పూర్ గ్రామ సర్పంచ్ గద్ద కుమారస్వామి, బిక్షపతి, కొత్తకొండ లలిత నాగరాజు, గద్ద రజిత సంపత్, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మండల సురేందర్, గట్ల నర్సింగాపూర్ సర్పంచ్ బొల్లంపల్లి అజయ్ కుమార్, బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు రచ్చ సంపత్ తదితరులు పాల్గొన్నారు.