calender_icon.png 7 February, 2026 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల కోసం పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల ఏర్పాటు

07-02-2026 01:46:13 AM

ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ 

మెదక్, ఫిబ్రవరి 6(విజయ క్రాంతి) :మున్సిపాలిటీ ఎన్నికలు 2026 సందర్భంగా ఎన్ని కల విధుల్లో పాల్గొనే అధికారులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక పోస్టల్ బ్యాలె ట్ సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్ సెంటర్ ను జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సంబంధిత సిబ్బందితో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్, నర్సాపూర్, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఓటర్లుగా ఉన్న ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు (PO/APO/OPO, RO/ARO, జోనల్ అధికారులు తదితరులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్య (ఫెసిలిటేషన్) కేంద్రాలకు హాజరై తమ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ వివరించారు.

7, 8 వ తేదీల్లో వినియోగించుకునే పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి నాలుగు మున్సిపాలిటీకి సంబంధించి ఫెసిలిటేషన్ సెంటర్లో అన్ని సౌకర్యాలు. పూర్తి చేసినట్టు తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు తమ ఎన్నికల విధి ఆర్డర్, ఓటర్ ఐడి కార్డు మరియు ఫారం-12 (పోస్టల్ బ్యాలెట్ కోసం రిక్విజిషన్)తో సంబంధిత సౌకర్య కేంద్రానికి హాజరుకావాలి. అక్కడే పోస్టల్ బ్యాలెట్లు జారీ చేస్తారు అని వివరించారు.