21 May, 2026 | 2:50 AM

హైదరాబాద్ ఇన్నోవేషన్ హబ్

21-05-2026 01:36 AM
  1. అనుకూల పారిశ్రామిక విధానాలు, మౌలిక వసతులు
  2. ముందుకొస్తున్న ప్రఖ్యాత సంస్థలు
  3. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి) : ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు తమ తొలి ఇన్నోవేషన్ సెంటర్ల కోసం హైదరాబాద్‌ను ఎంచుకోవడం నగర సామర్థ్యానికి నిదర్శనమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. బీఏఎస్‌ఎఫ్ తన తొలి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిందని, అలాగే వ్యాన్‌గార్డ్ భారత్‌లో తన తొలి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఇక్కడే ప్రారంభించిందన్నారు. మారియట్ ఇంటర్నేషనల్, హెచ్‌సీఏ హెల్త్‌కేర్, ది హార్ట్‌ఫోర్డ్ వంటి సంస్థలు కూడా హైదరాబాద్‌ను తమ ఇన్నోవేష న్ హబ్‌గా ఎంచుకున్నాయని తెలిపారు.

హైటెక్‌సిటీలో సత్వా నాలెడ్జ్ సిటీ లో సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థ వారి తొలి గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను బు ధవారం మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. హైదరాబాద్ మరో అంతర్జాతీయ పెట్టుబడిని సొంతం చేసుకుందని తెలిపారు.

అమెరికాలోని ప్రముఖ విమానయాన సం స్థ సౌత్‌వెస్ట్ ఎయిర్ లైన్స్ తన తొలి గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను అమెరికా వెలుపల మొదటిసారిగా హైదరాబాద్‌లో ప్రారంభించడం తెలంగాణకు గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. 25 ఏళ్ల క్రితమే హైదరాబాద్ దేశంలో ఆధునిక విమానయాన రంగానికి పునాది వేసిందని, పీపీపీ మోడల్‌లో దేశంలోని తొలి ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్‌లలో ఒక దా నిని ఏర్పాటు చేసిన నగరంగా హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. 

వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు..

సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా 1,000కి పైగా హైస్కిల్ ఇంజినీర్లు, టెక్నాలజీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని మంత్రి చె ప్పారు. ఈ కేంద్రం ద్వారా ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఇంజినీరింగ్, ఆటోమేషన్, ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫారమ్స్ వంటి అత్యాధునిక రంగాల్లో కార్యకలాపాలు సాగనున్నాయని వెల్లడించారు. ప్రపంచస్థాయి ప్రతిభ, బలమైన మౌ లిక సదుపాయాలు, అనుకూల పారిశ్రామిక విధానాలు హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ డెస్టినేషన్‌గా నిలబెట్టాయని పేర్కొన్నారు.

సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ నిర్ణయం భవిష్యత్ గ్లోబల్ మొబిలిటీ, ఏవియేషన్ ఇంజినీ రింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో హైదరాబాద్ కీలక పాత్ర పోషించబోతుందనే విష యాన్ని మరోసారి రుజువు చేసింన్నారు. ప్ర స్తుతం హైదరాబాద్‌లో 450కుపైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, వాటిలో 1.35 లక్షలకుపైగా నిపుణులు పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు.