07-02-2026 01:44:49 AM
అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ వ్యక్తిత్వంపై దాడి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి) : రేవంత్‌రెడ్డి ‘తిట్ల ట్రాప్’లో పడొ ద్దని తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా బీఆర్‌ఎస్ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కేవలం తన వైఫల్యాలను, హామీల అమలును కపిపుచ్చుకోవడానికి కీలకమైన మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్‌రెడ్డి తిట్ల దండకం అందుకున్నారని విమర్శించారు. ఈ మేరకు శుక్ర వారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశా రు. తెలంగాణ గడ్డపై ప్రస్తుతం ఒక వికృతమైన రాజకీయ క్రీడ నడుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటంతో, ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ అని, ఒక తండ్రిలా ఈ రాష్ట్రా న్ని అక్కున చేర్చుకుని, పడావు పడ్డ తెలంగాణను ప్రగతి బాటలో నడిపించిన మహో న్నత శిల్పి ఆయనేనని కొనియాడారు. కేసీఆర్ ఎప్పుడూ బిరుదులు, సన్మానాల కోసం పాకులాడలేదని, తెలంగాణ ప్రజల శ్రేయ స్సు, సంక్షేమమే ఆయనకు నిజమైన సత్కారమని కేటీఆర్ స్పష్టం చేశారు. నేడు అధికా ర గర్వంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ వ్యక్తిత్వం మీద విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
తెలంగాణకు గ్రహణ కాలం
ప్రజల కన్నీటిని తుడిచే దిశగా మన పోరాటం సాగాలని, అబద్ధపు ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎరువుల కోసం క్యూలైన్లలో రైతులు పడుతున్న పాట్లు, రైతు భరోసా అందక ప్రైవేట్‌వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకున్న అన్నదాతల కష్టాల గురించి గొంతెత్తాలని సూచించారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వృద్ధులు, డీఏలు, పీఆర్సీ లేక నలిగిపోతున్న ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన నిలబడాలని కోరారు. తెలంగాణకు ఇది ఒక గ్రహణ కాలమని, రేవంత్ అనే రాహువు నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డపై ఉందని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనపై మున్సిపల్ ఎన్నికల్లో ప్రశ్నలను పిడుగుల్లా కురిపించాలని పిలుపునిచ్చారు.