విజయ్‌కు షాక్ ఇచ్చిన గవర్నర్!
అంతా అనిశ్చితి
అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్
టీవీకేకు స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నో
తెరపైకి మరో సంచలనం.. డీఎంకే, అన్నాడీఎంకే మంతనాలు
అధికారం చేజిక్కించుకునేందుకు చర్చోపచర్చలు
టీవీకేకు కాంగ్రెస్ మద్దతు.. ససేమిరా అన్న సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్
తమిళనాడులో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. టీవీకేకు గవర్నర్ షాక్ ఇవ్వగా, డీఎంకే-ఏఐఏడీఎంకే మధ్య రహస్య మంతనాలు జరుగుతున్నట్లు సమాచారం.
చెన్నై, మే ౬: తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతున్నది. ఏ పార్టీకీ స్పష్టమైన బలం లేకపోవడంతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ బుధవారం అసెంబ్లీని రద్దు చేశారు. తమకు 112 మంది ఎమ్మెల్యేల బలం ఉందంటూ టీవీకే అధినేత విజయ్ వారి సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించగా, ప్రభుత్వం ఏర్పాటుకు మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరమని, కాబట్టి ప్రభుత్వ ఏర్పాటు రాజ్యాంగపరంగా సాధ్యం కాదని తేల్చిచెప్పారు.
తమిళనాడు ఎన్నికల పూర్తి అప్డేట్స్ కోసం ప్రత్యేక ఎన్నికల విభాగాన్ని ఫాలో అవండి
తమిళనాడు రాజకీయాలు గంట గంటకూ ఉత్కంఠగా మారుతున్నాయి. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే అధికారానికి చేరువైనప్పటికీ, సంఖ్యాబలం లేకపోవడం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది.
దీంతో టీవీకే తిరిగి ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే పనిలో పడింది. మరోవైపు, ఇద్దరు ఎమ్మెల్యేల చొప్పున బలం ఉన్న సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంల్ ఎట్టిపరిస్థితుల్లోనూ టీఎంకేకు మద్దతు ఇవ్వబోమని ప్రకటించాయి. అంతేకాదు.. ఆ పార్టీలు డీఎంకేకే మద్దతు ఇవ్వబోతున్నాయన్న ప్రచారం జరుగుతున్నది. ఒక దశలో అన్నాడీఎంకే నుంచి సుమారు ౩౫ మంది ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు తెలుపబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది.
అయితే.. తమ పార్టీ ఎప్పటికీ టీవీకేకు మద్దతు తెలిపేది లేదని అన్నాడీఎంకే ప్రధా న కార్యదర్శి పళనిస్వామి ఓ ప్రకటనలో తేల్చిచెప్పారు. ఇదంతా ఒకవైపు అయితే.. రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనమైన విషయం బయటకు వచ్చింది. దశాబ్దాలుగా ఉప్పు నిప్పులా ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నాయి. టీవీకే అధికార పీఠమెక్కకుండా అడ్డుకట్ట వేసేందుకు, రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి రెండు పార్టీల పెద్దలూ రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు తెలిపింది.
డీఎంకే, అన్నాడీఎంకే బలాబలాలు..
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో డీఎంకే 59 స్థానాలను గెలుచుకుంది. ఏఐఏడీఎంకే 47 సీట్లను దక్కించుకుంది. ఈ రెండు పార్టీలు కలిస్తే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 106కు చేరుతుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 118 మంది ఎమ్మెల్యేల మద్ద తు అవసరం. అంటే.. ఆ కూటమికి ఇంకా 12 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. ఈ కూటమి విజయతీరాలకు చేరాలంటే ఖచ్చితంగా సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంల్ తో పాటు ఇతర పార్టీల మద్దతు తీసుకోవాల్సిందే.
తాజా రాజకీయ, క్రైమ్, బ్రేకింగ్ న్యూస్ కోసం విజయక్రాంతి న్యూస్‌ను సందర్శించండి.
అయితే.. ఆయా పార్టీలు తమ నిర్ణ యాలను ప్రకటించకుండా వెనక్కి తగ్గడం రాజకీయ ఉత్కంఠను పెంచుతోంది. ఒకవేళ ఈ చిన్న పార్టీలు డీఎంకే వైపే మొగ్గు చూపి తే తమిళనాడులో సరికొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది. అటు.. 108 స్థానా లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే కూడా మెజారిటీ మార్కును అందుకునేందు కు మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కూ డగట్టాల్సి ఉంది. మొత్తానికి ఈ నంబర్ గేమ్ దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం తమిళనాడులో పరిస్థితి ఏంటి?
- ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 సంఖ్య అవసరం
- గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదు
- డీఎంకే, ఏఐఏడీఎంకే కొత్త సమీకరణాలపై చర్చలు జరుపుతున్నాయి
- టీవీకే వద్ద 112 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది
- చిన్న పార్టీల మద్దతు కీలకంగా మారింది.
ఇవి కూడా చదవండి:
‘విజయ్ అనే నేను’.. సీఎం పీఠం ఖాయం?
TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు
గవర్నర్‌ను కలిసిన టీవీకే చీఫ్ విజయ్
తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ






