13 July, 2026 | 1:42 PM

గ్రామాలకు తరలిన బీఎల్‌వోలు

13-07-2026 12:44 PM

బోథ్, జూలై 13 (విజయక్రాంతి): ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా సోమవారం సోనాల మండలం రెవెన్యూ అధికారులు బిఎల్ఓ లు గ్రామాలకు తరలి వెళ్లి ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని గుర్రాల తండా గ్రామంలో ఎస్ ఐ ఆర్ పై అవగాహన కల్పించి ఓటర్ల నుండి ఎస్ ఐ ఆర్ దరఖాస్తులను స్వీకరించారు. పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులు సమర్పించాలని తప్పులు ఉంటే సరిదిద్దు ఇవ్వాలని సూచించారు. లేకుంటే ఓటు హక్కును కోల్పోవాల్సి ఉంటుందని తెలిపారు.