7 May, 2026 | 1:59 AM

ఒప్పందానికి రాకుంటే దాడులు తీవ్రం

07-05-2026 01:02 AM
  1. ఇరాన్‌కు ౪౮ గంటల గడువు ఇస్తున్నాం..
  2. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

వాషింగ్టన్, మే ౬: ఇరాన్ శాంతి ఒప్పందానికి దిగిరాకుంటే, ఆ దే శంపై ఉధృతంగా బాంబు దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీవ్రమైన హెచ్చరికలు చేశారు. రెండు దేశాల మధ్య త్వరలో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని, ఒకవేళ చర్చలు విఫలమైతే మాత్రం మునుపటి కంటే ఇరాన్ భయంకరమైన దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తేలిచెప్పారు. ఈ విషయంపై 48 గంటల్లోపు ఇరాన్ తన నిర్ణయాన్ని తేల్చిచెప్పాలని కూడా హుకుం జారీ చేశారు. అలాగే, ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చల్లో పురోగతి ఉన్న నేపథ్యంలో హోర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న విదేశీ నౌకలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు తా ము ప్రారంభించిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనం మాత్రం కొనసాగుతోందని స్పష్టం చేశారు. యుద్ధం ముగించేం దుకు ఇరాన్ ఇప్పటికే 14 ప్రతిపాదనలను అమెరికా ముందుంచిన విషయం తెలిసిందే.