గవర్నర్‌ను కలిసిన టీవీకే చీఫ్ విజయ్
తమిళనాడులో క్షణక్షణం మారుతున్న రాజకీయ పరిస్థితులు
విజయ్ భద్రత తగ్గించిన అధికారులు
చెన్నై: తమిళనాడులో రాజకీయ పరిస్థితులు క్షణక్షణం మారుతున్నాయి. దీంతో టీవీకే అధినేత విజయ్ కు అధికారులు భద్రత తగ్గించారు. రెండ్రోజులుగా విజయ్ వెంట ఉన్న కాన్వాయ్ ను పోలీసులు తొలగించారు. మేజిక్ ఫిగర్ కు సరిపడా ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు ఇవ్వడంలో విజయ్ విఫలం అయ్యారు. ఎమ్మెల్యేల జాబితా ఇవ్వడంలో విజయ్ విఫలం కావడంతో భద్రత తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు.
తమిళనాడు ఎన్నికల పూర్తి అప్డేట్స్ కోసం ప్రత్యేక ఎన్నికల విభాగాన్ని ఫాలో అవండి.
కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడంతో టీవీకే బలం 112 చేరింది. గురువారం నాడు లోక్‌భవన్‌కు చేరుకున్న టీవీకే చీఫ్ విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను((TVK Chief Vijay Meets Governor)) కలిశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గాను 108 స్థానాలను గెలుచుకోవడం ద్వారా TVK ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటుకు TVKకి తమ పూర్తి మద్దతును అందించాలని 5 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సీపీఐ, సీపీఎం, ఇతర చిన్న పార్టీలు విజయ్ కు మద్దతు ఇస్తున్నట్లు నిన్న మీడియా కథనాలు సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి.
తాజా రాజకీయ, క్రైమ్, బ్రేకింగ్ న్యూస్ కోసం విజయక్రాంతి న్యూస్‌ను సందర్శించండి.






