13 March, 2026 | 11:26 AM

ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ బడుల పటిష్టత

13-03-2026 12:00 AM

ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): ప్రైవేట్ విద్యా వ్యవస్థకు దీటుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది నిధులను వెచ్చిస్తోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం బోరజ్ మండలంలోని బాలాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఈజీఎస్ నిధులతో చేపట్టే కిచెన్ షెడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... విద్యాభి వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి పలు పథకాలను అమలు చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం సైతం విద్యా రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. 

ఇటీవల ఆదిలాబాద్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపమని, దీంతో జైనథ్ మండలం బెల్గాం గ్రామ సమీపంలో సుమారు రూ. 200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం చేపట్టనుంది అని తెలిపారు. ఈ పాఠశాల ద్వారా సుమారు 3,500 మంది పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.