13 March, 2026 | 12:41 PM

ప్రజాపాలన చేద్దాం.. ప్రగతి ప్రణాళిక సాధిద్దాం

13-03-2026 12:00 AM
  1. నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రజా ప్రతినిధులకు అవగాహన సదస్సు 
  2. పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యేలు 

నిర్మల్, మార్చి ౧౨ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసి ప్రగతి సాధిద్దామని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నా రు. గురువారం జిల్లా కేంద్రంలోని తిరుమల గార్డెన్‌లో జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఈ పథకంపై అవగాహన కల్పించా రు.

నిర్మల్ జిల్లాలో 18 మండలాలు మూడు మున్సిపాలిటీలో ప్రజా పాలన ప్రగతి ప్రగతి ప్రణా ళికలో చేపట్టబోయే కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యం అధికారుల బాధ్యత ప్రజా ప్రతినిధుల సహకారం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాం తాల్లో ప్రజలకు మౌలిక వస్తువులను కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమ లు చేస్తుందని కలెక్టర్ గుర్తు చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధుల సమస్యలపై, ప్రజా సమస్యలపై అధికారులు తక్షణం స్పందించాలి. ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు వారి సమస్యలను విన్నవిస్తే కలెక్టర్ ఎస్పీ జిల్లా అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలిపారు. గ్రామపంచాయల అభివృద్ధికి ప్రభుత్వం విధు లు మంజూరు చేస్తేనే ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుందన్నారు. 

ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జి పటేల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక కార్యదర్శులతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలు చేస్తుందని, ఈ కార్యక్రమం ముందు కు తీసుకెళ్లాలంటే ప్రజాప్రతినిధులు బాధ్యతగా వివరించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న నేపథ్యంలో ఆ నిధులను ప్రజా ప్రయోజనాలకి వినియోగించుకోవాలని సూచించారు. అభివృద్ధి విష యంలో రాజకీయాలు లేవని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 

ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాల న ప్రగతి ప్రణాళికలో ప్రధానంగా నీటి సమస్యపై దృష్టి పెట్టాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో మిషన్ భగీరథ ఉన్న గ్రామాలకు నీళ్లు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరెంటు కోతలులో వోల్టేజ్ సమస్య కారణ ంగా పంటలు ఎన్ని పోతున్నాయని తెలిపారు. గ్రామాల్లో కార్యదర్శులను తక్షణం బదిలీ చేయాలని కలెక్టర్‌కు విన్నవించారు. 

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు కిషోర్ కుమార్ భైంసా సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్, ఆర్డిఓ రత్న కళ్యాణి నిర్మల్ మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య గణేష్, బైంసా మున్సిపల్ చైర్ పర్సన్ దత్తాద్రి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమన్ అలీ అధికారులు పాల్గొన్నారు.