ఆదాయ సమీకరణపై దృష్టి పెట్టాలి
హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ, కమర్షియల్ ట్యాక్స్..
ఎక్సైజ్, మైనింగ్ శాఖలపై ప్రత్యేక నిఘా పెట్టాలి
- ఛేజింగ్ సెల్‌ను ఏర్పాటు చేయాలి
- ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాను ఏఐతో అనుసంధానం చేయాలి
- సమీక్ష సమావేశంలో అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి) : రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాలను విజయ వంతంగా సాధించాలంటే ఆదాయ సమీకరణపై అధికారులు సీరియస్‌గా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదాయం పెంపుదల, నిధుల సమీకరణ విషయం లో ఎలాంటి నిర్లక్ష్యానికి సహించేది లేద ని సీఎం స్పష్టం చేశారు. బుధవారం ఎంసీహెచ్‌ఆర్‌డీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ సంజయ్ జాజు, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావుతో కలిసి అధికారులతో సీఎం సమ వేశమయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆదాయ లీకేజీలను అరికట్టడానికి హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ, కమర్షి యల్ ట్యాక్సెస్, ఎక్సైజ్, మైనింగ్ వంటి కీలక శాఖలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఆదాయం పెంపు ప్రక్రియను రోజువారీగా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక ‘ఛేజింగ్ సెల్’ను ఏర్పాటు చేసి నిరతంరం ఫాలోఆప్ చేయాలన్నా రు. ప్రభుత్వ పథకాల పాదర్శకత కోసం సరికొత్త సాంకేతికతను వాడుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయో గించుకుని లబ్ధిదారుల జాబితాను ఖరారుచేయాలని, దానిని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ)కి అనుసంధానం చేయాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేశా రు. ఇకపై ఊహాజనిత బడ్జెట్ కాకుండా క్షేత్రస్థాయి వాస్తవికత ఆధారంగానే కొత్త బడ్జెట్ రూపొందించాలని స్పష్టంచేశారు. పెండింగ్ ప్రాజెక్టులను, ఇతర పనులను పూర్తిచేసేందుకు అనుగుణంగా కేటాయింపులు ఉండాలని, భూసేకరణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఆశించిన ఫలితాలు సాధించాలంటే అధికారులు సామర్థ్యాన్ని మెరుగు పర్చుకోవాలని సీఎం చెప్పారు.






