వంద శాతం స్త్రీనిధి రుణాల రికవరీ సాధించాలి
కలెక్టర్ కె. హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 1(విజయ క్రాంతి): జిల్లాలో స్త్రీనిధి రుణాల రికవరీ, రుణాల పంపిణీలో అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాల ని జిల్లా కలెక్టర్ కె. హరిత ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి మండలానికి ప్రత్యే క రికవరీ లక్ష్యాలను నిర్దేశించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
అర్హు లైన ప్రతి స్వయం సహాయక సంఘ సభ్యురాలికి స్త్రీనిధి రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశిం చారు. రికవరీ చెల్లింపులు తప్పనిసరిగా ‘మన నిధి’ యాప్ ద్వారానే జరగాలని, చెక్కులు లే దా ఇతర బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లింపు లు చేయరాదని స్పష్టం చేశారు.
ప్రతి నెల కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తూ లక్ష్యాల సాధనను నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో డీఆర్డీఓ దత్తారావు, స్త్రీనిధి జోనల్ మేనేజర్ పి. శ్రీనివాస్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ప్రమీల, మెప్మా అధ్యక్షురాలు సునీత, అధికారులు పాల్గొన్నారు.
వనమహోత్సవంలో నాటిన మొక్కలను సంరక్షించాలి
వనమహోత్సవం2026లో నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత సంబంధిత శాఖలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హరి త ఆదేశించారు. వనమహోత్సవంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జిల్లాకు కేటాయించిన 46.78 లక్షల మొక్కల నాటకం లక్ష్యాన్ని వర్షాకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఖాళీ ప్రదేశాలు, చెరువుల గట్లు, కాలువల వెంట విస్తృతంగా మొక్కలు నాటాలని చెప్పారు.నాటిన మొక్కలకు కంచెలు ఏర్పాటు చేయడం, నీరు అందించడం, వా టి మనుగడను నిర్ధారించేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించా రు. శాఖల మధ్య సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డే విడ్, జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం
కలెక్టరేట్కు వచ్చే ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ కె. హరిత ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిరోజూ కలెక్ట రేట్కు వచ్చే ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ఈ లక్ష్యంతో రూ.2 లక్షల వ్య యంతో ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.సామాజిక బా ధ్యతలో భాగంగా ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు, సంస్థలను కలెక్టర్ అభినం దించారు. ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల చేతుల్లో విద్యార్థుల భవిష్యత్తు
విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. కెరమెరి మండలం అగర్వాడ గ్రామంలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, తల్లిదండ్రులు పిల్లలను ప్రతిరోజూ పాఠశాలకు పంపాలని, ఉపాధ్యా యులు నాణ్యమైన విద్య అందించి 100 శాతం హాజరు నమోదయ్యేలా కృషి చేయాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అ న్ని సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫారాలు, పోషకాహారం అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో నెలకొన్న పలు సమస్యల ను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.






