కాంగ్రెస్‌లో కొనసాగే పరిస్థితి లేదు
- 25న అభిమానులు శ్రేయోభిలాషులతో సమావేశం
- పార్టీ సభ్యత్వానికి రాజీనామా
- నాలుగు దశాబ్దాల అనుబంధం తెంచుకోవడం బాధాకరమే
- శాసన మండలిలో ఒంటరి పోరాటం చేసిన
- అధికారంలో ఉన్న ప్రజల పక్షం నిలబడి పోరాటం చేసిన
- మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
జగిత్యాల, మార్చి 22 (విజయక్రాంతి): ఇరవై మాసాల నుంచి జగిత్యాలలో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్‌లో కొనసాగ టం ఆలోచించుకునే పరిస్థితి కల్పించాయి.. నా సమస్యకు పరిష్కారం లేకపోవడంతో నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఇక సా ధ్యం కాదని నిర్ణయానికి వచ్చాను.. నాలుగు దశాబ్దాల అనుబంధం తెంచుకోవడం బాధాకరంగానే ఉందని మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత తాటిపర్తి జీవన్‌రెడ్డి తెలిపారు.
ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మొదటి నుంచి ప్రజ ల పక్షం నిలబడి అధికార పార్టీలో ఉండి కూడా నేను పోరాటం చేశానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సకాలంలో రుణాలు చెల్లించిన వారికి ప్రోత్సాహకంగా రూ.5వేలు చెల్లిస్తామని హమీ ఇచ్చి, జగిత్యాలలో అమలు చేయకపోవడంతో రైతులకు ప్రోత్సాహకం అందించాలని మంత్రిగా ఉండి కూడా ధర్నా చేసిన అని జీవన్‌రెడ్డి గుర్తు చేశారు.
ఎలెక్ట్రిసిటీ అదనపు బిల్లు ఉపసంహరించాలని ఎమ్మెల్సీగా ఉండి కూడా ఉద్యమించి న నా సమస్యకు పరిష్కారం లేకపోవడంతోశ్రీధర్ బాబు నాతో ఉన్న అనుబంధంతో మాట్లాడారు. నా సమస్యకు ఎవరి వద్ద పరిష్కారం లేదని అన్నారు. పార్టీ ఫిరాయింపు ఎ మ్మెల్యేలు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చే సుకోకుండా చూడాలని సూచించాను. ప్రతిపక్ష పార్టీగా దశాబ్ద కాలంగా పని చేసి, అధికారం వచ్చిన తర్వాత మా హక్కులు కాలారా స్తుంటే ఎంతకాలం భరించాలి అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుదారులు పార్టీని నడిపిస్తున్నారు. రాజకీయమే గౌరవం కోసం.. ఆ గౌరవం లేకపోవడంతో పార్టీలో కొనసాగటం వల్ల ప్రయోజనం ఏమి టి నా పరిస్థితి వివరించిన తర్వాత శ్రీధర్ బాబు కూడా సమాధానం చెప్పలేకపోయా రు అని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాలలో కాంగ్రెస్‌ను ఐక్యంగా నిలపడానికి ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు అండగా నిలవడంతో ఈ స్థాయిలో ఎదిగిన. టీడీపీ పాల నలో సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రె స్ పార్టీ గెలుచుకుంది.
2014 లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిం చాం. కార్యకర్తలు, అభిమానులు మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తల హక్కుల కోసం పోరా టం చేసిన. నాలో అసహనం పెరుగుతుంది. ప్రత్యర్థి పై పోరాటం చేయటం సహజం కానీ సొంత పార్టీపై పోరాటం చేయటం ఎంత బాధాకరం అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో నే ను ప్రతిపాదించిన వారికి టిక్కెట్లు వచ్చిన వారికి ఎన్నికల్లో ప్రచారం చేయలేకపోయిన కాంగ్రెస్‌లో కొనసాగటం సరి కాదని, వైదొలగాలని అభిప్రాయానికి వచ్చిన 25న స్థానిక బండారి గార్డెన్ లో రాజకీయ సహచరులు, అభిమానులు, శ్రేయోభిలాషులతో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటాం. రాష్ట్ర నాయకత్వం అధిష్ఠానంపై నెట్టివేస్తున్నారు. నాకు అన్యాయం జరగడంలో ఎమ్మెల్యే పా త్ర సైతం ఉంది అని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణకు ఆధారం ప్రాణహిత నది ప్రాణహిత నీరు వృథాగా పోతున్న నీటిని ఉప యోగించుకోవాలని తుమ్మడి హేట్టి వద్ద ని ర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఆదిలాబాద్ నుంచి రంగారెడ్డి వరకు తాగు నీరు, సా గు నీరు పారిశ్రామిక అవసరాలకు ఆధారం ప్రాణహిత. తుమ్మడి హేట్టి జాప్యంతో ఉత్తర తెలంగాణ కరువు తలెత్తే ప్రమాదం ఉంది. ఇంత వరకు మేడిగడ్డ పునరుద్ధరణ చేపట్టడం లేదు. కాంట్రాక్టర్ మరమ్మత్తు పనులు చేపట్టకపోతే ప్రభుత్వమే చేపట్టి, కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు.
తుమ్మడి హేట్టి బ్యారేజ్ నిర్మాణం ఎన్నికల్లో మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రజాహిత అంశాలు విస్మరించడం ఎంత వరకు సమంజసమని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల ప్రభావం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపుతుంది.మంత్రిగా నాకు అర్హ త ఉంది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మండలిలో ఒంటరి పోరు చేసిన రే వంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలా నేను నా స్థాయిలో పోరాటం చేసిన నా సంయమనానికి పరిమితి ఉండదా.
ప్రజాస్వామ్యంలో నా స్వే చ్ఛకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్న అని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 25నా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తు న్నాం.. జగిత్యాలతో నా అనుబంధం ఎవరు తెంచలేరు.నా చివరి శ్వాస వరకు జగిత్యాలతో అనుబంధం కొనసాగుతుందని అన్నా రు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




