29 June, 2026 | 1:13 AM

ఉద్యమ కారుడి వివాహానికి పిల్లుట్ల రఘు చేయూత

29-06-2026 12:31 AM

గరిడేపల్లి, జూన్ 28: మండల పరిధిలోని కీతవారిగూడెంలో తెలంగాణ మలిదశ ఉద్యమ కారుడు అమరగాని లక్ష్మణ్ గౌడ్ గౌతమిల వివాహానికి పిల్లుట్ల రఘు పట్టు పంచ కండువా వధువుకు పట్టుచీర మెట్టెలు అందించారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పిల్లుట్ల రఘు మాట్లాడుతూ ప్రతి పేదింటి ఆడబిడ్డల కళ్యాణానికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్, గౌతమిల వివాహ శుభకార్యానికి కూడా రఘు అన్న చేయూత కిట్టు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కీతవారిగూడెం గ్రామ సర్పంచ్ బొల్లెపల్లి రామనాథం గౌడ్, నియోజకవర్గ నాయకులు పోలంపల్లి ఆనంద్ బాబు గౌడ్, మండవ నాగేశ్వరరావు, అమర గాని బక్కయ్య, నర్సింగ్ రవి, కార్యకర్తలు పాల్గొన్నారు.