అధికారుల సేవలు అభినందనీయం
మూసాపేట్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం నిర్వాహణ లో మూసాపేట్ మండలం(Moosapet Mandal) జిల్లాలోనే 100%మొదట పూర్తి చేసిన మండలం గా నిలవడం అభినందనీయమని పలు టిఆర్ఎస్ నేతలు అధికారులను శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా తాసిల్దార్ రాజు నాయక్ ఈ కార్యక్రమం లో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఎప్పటికప్పుడు పరిష్కరించే అధికారులకు మండల బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్, మాజీ జెడ్పిటిసి సభ్యులు ఇంద్రయ్య సాగర్, మాజీ ఎంపీపీ కళావతి కొండయ్య , బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు రఘురాములు, శిరీషా ఆంజనేయులు యాదవ్, రెడ్డిరాజు ,రాధికా రవికుమార్ ,శివ రాములు, రాజు రవివర్ధన్ ,యాదయ్య, ఆంజనేయులు గౌడ్, తదితరులు పాల్గొన్నారు






