7 August, 2026 | 4:59 PM

Breaking News

సిద్దిపేట టిఐసిసిఐ కో-ఆర్డినేటర్‌గా బిక్షపతి   •   గణపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ముందస్తు బోనాల సంబరాలు   •   క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి   •   వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల   •   అచ్చంపేటలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయి   •   విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   బీజేపీ కిసాన్ మోర్చా నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత   •   అన్నపూర్ణ పంప్ హౌస్ లు ఆన్ చేయాలి: సిద్ధం వేణు   •   గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   ఆరేళ్ల నిరీక్షణకు తెర.. మళ్లీ విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం 4వ యూనిట్   •  

పశుసంవర్ధక రంగాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

07-08-2026 03:48 PM

- రైతుల ఆధార్ నమోదు 100% పూర్తి చేయాలి

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): జిల్లాలో పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేసి పశుపోషక రైతుల ఆదాయం పెంచేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆదేశించారు. జిల్లాలోని ప్రతి పశుపోషక రైతు ఆధార్ నమోదును 100 శాతం పూర్తి చేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 31.66 లక్షల పశుసంపద ఉన్నందున వ్యాధి నిరోధక టీకాలు, మొబైల్ వెటర్నరీ సేవలు, కృత్రిమ గర్భధారణ, పశుగ్రాసం, పాల ఉత్పత్తి పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అలాగే జిల్లా కేంద్రంలో ఆధునిక జిల్లా పశువైద్యశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయిలో రైతులకు శాస్త్రీయ పశుపోషణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.