7 August, 2026 | 4:57 PM

Breaking News

గణపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ముందస్తు బోనాల సంబరాలు   •   క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి   •   వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల   •   అచ్చంపేటలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయి   •   విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   బీజేపీ కిసాన్ మోర్చా నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత   •   అన్నపూర్ణ పంప్ హౌస్ లు ఆన్ చేయాలి: సిద్ధం వేణు   •   గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   ఆరేళ్ల నిరీక్షణకు తెర.. మళ్లీ విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం 4వ యూనిట్   •   అర్బన్ రెసిడెన్షియల్ తనిఖీ చేసిన అదనపు కలెక్టర్   •  

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

07-08-2026 03:35 PM

అప్పయ్య పల్లి సర్పంచ్ రమేష్

గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

గణపురం,(విజయ క్రాంతి): సీజనల్ వ్యాధుల పట్ల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అప్పయ్య పల్లి సర్పంచ్ ఎలకపల్లి రమేష్ అన్నారు. మండలం అప్పయ్యపల్లి గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని వైద్యురాలు నిహారిక ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ సందర్భంగా సర్పంచ్ ఎలుకపెళ్లి రమేష్ మాట్లాడుతూ, వర్షాకాలం కారణంగా గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన ఈ శిబిరం ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాల , అంగన్వాడి కేంద్రంలో విద్యార్థులు, గ్రామ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రక్తపోటు పరీక్షలు చేశారు. పిల్లలకు ఆరోగ్యంపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాకేష్ రెడ్డి, శేఖర్, ఆరోగ్య కార్యకర్త వినోద, ఆశా కార్యకర్తలు స్వప్న, పద్మ, అంగన్వాడి ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.