7 August, 2026 | 4:53 PM

Breaking News

గణపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ముందస్తు బోనాల సంబరాలు   •   క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి   •   వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల   •   అచ్చంపేటలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయి   •   విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   బీజేపీ కిసాన్ మోర్చా నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత   •   అన్నపూర్ణ పంప్ హౌస్ లు ఆన్ చేయాలి: సిద్ధం వేణు   •   గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   ఆరేళ్ల నిరీక్షణకు తెర.. మళ్లీ విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం 4వ యూనిట్   •   అర్బన్ రెసిడెన్షియల్ తనిఖీ చేసిన అదనపు కలెక్టర్   •  

డీసీఎంను ఢీకొన్న ద్విచక్రవాహనం

07-08-2026 04:26 PM

తండ్రి అక్కడికక్కడే మృతి.. కొడుకుకు తీవ్ర గాయాలు

ముత్తారం మండలం కేసనపల్లి వద్ద విషాదం

ముత్తారం,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని కేశనపల్లి వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముత్తారం వైపు నుంచి ద్విచక్రవాహనంపై తండ్రి, కొడుకులు వస్తుండగా కేసనపల్లి వద్ద రోడ్డుపై ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా, కొడుకుకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మృతుడు గోదావరిఖనికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు ద్విచక్రవాహనం పూర్తిగా దెబ్బతినగా, తండ్రి రోడ్డుపై పడి మృతి చెందిన దృశ్యం స్థానికులను కలచివేసింది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఆగి ఉన్న డీసీఎం వాహనానికి సరైన సూచికలు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందా? లేక ద్విచక్రవాహనం అదుపుతప్పి ఢీకొట్టిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.