7 August, 2026 | 4:58 PM

Breaking News

గణపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ముందస్తు బోనాల సంబరాలు   •   క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి   •   వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల   •   అచ్చంపేటలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయి   •   విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   బీజేపీ కిసాన్ మోర్చా నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత   •   అన్నపూర్ణ పంప్ హౌస్ లు ఆన్ చేయాలి: సిద్ధం వేణు   •   గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   ఆరేళ్ల నిరీక్షణకు తెర.. మళ్లీ విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం 4వ యూనిట్   •   అర్బన్ రెసిడెన్షియల్ తనిఖీ చేసిన అదనపు కలెక్టర్   •  

జిల్లాలో 30 కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదన

07-08-2026 03:46 PM

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): జిల్లాలో ఎన్నికల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు 30 కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 880 పోలింగ్ కేంద్రాలు ప్రతిపాదనలు అమల్లోకి వస్తే 910కు పెరగనున్నాయి. అలాగే 5 పోలింగ్ కేంద్రాల లొకేషన్ మార్పు, 2 కేంద్రాల పేర్ల సవరణ, 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న 3 కేంద్రాల విభజనకు కూడా ప్రతిపాదనలు రూపొందించినట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీల సూచనలు స్వీకరించిన అనంతరం తుది ప్రతిపాదనలు ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు తెలిపారు.