గంగమ్మ తల్లికి మొక్కులు తీర్చుకున్న మాజీ జెడ్పిటిసి
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని పోచారం ప్రాజెక్టు వద్ద ఉన్న గంగమ్మ తల్లిని మాజీ జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,స్థానిక మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి,కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.జూలై మాసంలో మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు,రైతులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.వర్షాకాలం ప్రారంభం సందర్భముగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండాలని గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి ప్రతి సంవత్సరం 5 కొబ్బరికాయలు కొడతారు. ప్రస్తుతం పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో శుక్రవారం 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య మాట్లాడుతూ... మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి గత పదిహేను,ఇరవై సంవత్సరాలనుండి పోచారం ప్రాజెక్టు వద్ద ఉన్న గంగమ్మ తల్లికి నూట ఒక కొబ్బరికాయలు కొట్టడం వల్ల అప్పటినుండి ఇప్పటివరకు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుతుందని హర్షం వ్యక్తం చేశారు ప్రాజెక్టు వద్ద ఉన్న గంగమ్మ తల్లికి మొక్కులు మొక్కుతే కోరికలు తీర్చుతాయని తెలిపారు.
గత వర్షాకాలం సందర్భంలో పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో దెబ్బతిని కుంగిపోయే స్థితిలో ఉండగా గంగమ్మ తల్లి మహత్కారంతో పోచారం ప్రాజెక్టును కాపాడిందన్నారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు సిద్దయ్య,సర్పంచ్లు వంశీ కృష్ణ గౌడ్,మహేందర్, సాయిలు,బాల్య నాయక్,మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మోతే శ్రీనివాస్,బీఆర్ఎస్ నాయకులు మిద్దె బాబురావు,హనుమంత్ రెడ్డి,నరేష్,సిద్దిరామ్ రెడ్డి, విజయ్ కుమార్,పికే రాజు, మల్లారెడ్డి,రైతులు తదితరులున్నారు.






