నిరుపేద విద్యార్థికి చేయూతగా హ్యూమన్ రైట్స్ సభ్యులు
సత్తుపల్లి,(విజయక్రాంతి): పట్టడంలోని నిరుపేద కుటుంబానికి చెందిన శిరీష ఆమె భర్త ఇటీవల మరణించడంతో, వారి కుమార్తె ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విషయం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సభ్యుల దృష్టికి వెళ్ళింది. ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థిని చదువుకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వెంటనే స్పందించిన సభ్యులు ఆమెకు సంవత్సరానికి అవసరమైన పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, పెన్నులను శుక్రవారం అందించారు.
అదేవిధంగా, భవిష్యత్తులో విద్యార్థినికి ఏ విధమైన అవసరం వచ్చినా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సభ్యులు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సభ్యులు సత్తుపల్లి ప్రాంతంలో ఇకపై కూడా అవసరమైన ప్రతి సందర్భంలో సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా జాయింట్ కన్వీనర్ మెరిపే సురేష్, తెలంగాణ స్టేట్ జాయింట్ కన్వీనర్ భాస్కర నాగప్రకాష్, తెలంగాణ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ బాజీ పాషా, తెలంగాణ వెల్ఫేర్ సెక్రెటరీ కాజా మొయిద్దీన్, ఖమ్మం జిల్లా జాయింట్ కన్వీనర్ బల్లి శ్రీనివాసు, ఖమ్మం జిల్లా ట్రెజరర్ గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.






