జోనేబోయిన ట్రస్ట్ సేవలు అభినందనీయం
పెనుబల్లి, జులై 31 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామానికి చెందిన నడవలేని స్థితిలో ఉన్న ముగ్గురు నిరుపేద వికలాంగుల గురించి తెలుసుకొని జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ని నడిపిస్తున్న మండాలపాడు గ్రామానికి చెందిన జోనేబోయిన అన్నపూర్ణ 20 వేల రూపాయలు విలువగల మూడు వీల్ చైర్ లను వితరణగా అందించారు. వాటిని విఎం బంజరు యస్‌ఐ వెంకటేష్ శుక్రవారం గ్రామంలో వున్న వికలాంగులకు అందచేశారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అన్నపూర్ణ ఒక వికలాంగురాలై అయ్యి వుండి కూడా తనకు వున్నదానిలో నిరుపేదల వికలాంగులు అని తెలిస్తే చాలు సాయం చేయడానికి వెనకాడదు అని, జోనెబోయిన చారిటబుల్ ద్వారా వీల్ చైర్ లు ట్రై సైకిల్స్ పంపిణి చేయడం అభినందనీయం అని విఎం బంజరు యస్‌ఐ వెంకటేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో యడ్ల బంజర్ సర్పంచ్ రాజిన్ని రాంబాబు, అంగన్వాడీ టీచర్ తిరుపతమ్మ, నాని తదితరులు పాల్గొన్నారు.






