ఓటరు సవరణ గడువు ఆగస్టు 3 వరకు..
మున్సిపల్ కమిషనర్ జాకీర్
మొయినాబాద్, జూలై 31 (విజయక్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధి లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) దరఖాస్తులకు ఆగస్టు 3వ తేదీ వరకు గడువు ఉందని మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ తెలిపారు. అర్హులైన ఓటర్లు కొత్త నమోదు, మార్పులు, చేర్పుల కోసం సంబంధిత బీఎల్‌ఓలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. గడువు దాటితే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు.
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు ప్రబలకుండా ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ సూచించారు. ఖాళీ స్థలాల యజమానులు వెంటనే ముళ్ల పొదలు, చెత్తను తొలగించాలని, లేకపోతే మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించి, ఆ ఖర్చును యజమానుల నుంచే వసూలు చేయడంతో పాటు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.






