మొక్కల పరిరక్షణలో గ్రీన్‌క్లబ్ ట్రస్ట్ సేవలు అభినందనీయం
సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా
సూర్యాపేట, జూలై 26 (విజయక్రాంతి) : పర్యావరణ పరిరక్షణలో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సరస్వతి స్కూల్ ఆవరణలో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పులు, ఎల్నీనో ప్రభావం, అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల వర్షపాతం తగ్గుతోందని, పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 60 నుంచి 70 మొక్కలను నాటగా, వాటి సంరక్షణ బాధ్యతను సరస్వతి స్కూల్ కరస్పాండెంట్ పర్వతం శ్రీధర్ స్వీకరించారు.
ఈ సందర్భంగా 8వ తరగతి విద్యార్థిని తోట శ్రీనిధి మొక్కలపై అవగాహన కల్పించే పాటతో ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లబ్ సభ్యులు ముప్పారపు నరేందర్, డాక్టర్ తోట కిరణ్, మీలా మహదేవ్, ఉప్పల శ్రవణ్, వందనపు శ్రీదేవి, ముప్పారపు నాగేశ్వరరావు, దేవరశెట్టి నాగరాజు, సోమ హేమమాలిని, మిట్టపల్లి సువర్ణలక్ష్మి, మారం పవిత్ర, మన్మధ్ రెడ్డి, శ్యామ్, వెంకట్, అలేఖ్య, సురేందర్, దారం శ్రీనివాస్, రామచంద్రయ్య, సరస్వతి స్కూల్ కరస్పాండెంట్ పర్వతం శ్రీధర్, వైస్ చైర్మన్ గుండా రమేష్, నాగవల్లి ప్రభాకర్, కొత్త మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.






