27 July, 2026 | 1:33 AM

ఉద్యమకారుల జేఏసీ చైర్మన్‌గా గుండా కరుణాకర్‌రెడ్డి

27-07-2026 12:37 AM

ఖమ్మంలో ఘన సన్మానం

ఖమ్మం, తిరుమలాయపాలెం, జూలై 26 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నూతన చైర్మన్గా తిరుమలాయ పాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది గుండా కరుణాకర్రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం కస్బాబజార్లోని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపీజే) కార్యాలయంలో ఆదివారం ఆయనను ఘనంగా సన్మానించారు. ఎంపీజే జిల్లా అధ్యక్షుడు షేక్ ఖాసీం అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల హక్కుల పరిరక్షణకు ఉద్యమకారులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కొందరు స్థానికేతర వ్యాపారులు పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నారని, దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ఖజానాతో పాటు ప్రజల ప్రయోజనాలకు భారీ నష్టం వాటిల్లుతోందని తెలిపినారు. ఇటువంటి అంశాలపై సంబంధిత యంత్రాంగం దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది, ఎంపీజే వ్యవస్థాపకుడు హైదర్ అలీ, ప్రధాన కార్యదర్శి నాసర్, సతీష్, కోశాధికారి అబ్దుల్ హకీమ్, జిల్లా నాయకులు రఫీ, రజ్జబ్ అలీ, అహ్మద్, సేవా బ్యాంకు మేనేజర్ రఫీ, రజాక్, తెలంగాణ ఉద్యమకారులు ఆసిఫ్, బురహన్ తదితరులు పాల్గొన్నారు.