పోతురాజుకి స్నిగ్ధ్దారెడ్డి బాలసాహిత్య పురస్కారం
సత్తుపల్లి జూలై 26 (విజయక్రాంతి): తెలుగు సాహితీ వనం తొమ్మిదవ వార్షిక మహోత్సవం సందర్భంగా,హైదరాబాదు రవీంద్రభారతిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో స్నిగ్దారెడ్డి బాల సాహిత్య పుర స్కారాన్ని సత్తుపల్లి బాల సాహిత్య రచయిత ఆవుల పోతురాజు స్వీకరించారు.
తెలుగు సాహితీ వనం నిర్వాహకులు శాంతికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రముఖ సాహితీవేత్తలు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, డాక్టర్ అంపశయ్య నవీన్, డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్ తదితరుల సమక్షంలో ఈ పురస్కారాన్ని నిర్వాహకులు అందచేశారు.
పేద కుటుంబంలో జన్మించి చదువుతోపాటు బాల సాహిత్యంలో పోతురాజు చేస్తున్న కృషికి అతిధులు ప్రశంసలుఅందచేశారు. పన్నెండు వేల రూపాయల సహాయం నిరుపేద వర్గానికి చెందిన పోతురాజు చదువు నిమిత్తం వేదిక నుండి పన్నెండు వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అతిధులు అంద చేశారు. పోతురాజు ప్రతిభను గుర్తించి సా హిత్య రచనకు ప్రోత్సహించిన తెలుగు ఉపాధ్యాయిని రమాదేవి వెంకటాచార్యులును ఈ సందర్భంగా అభినందించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి, ఆషా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ దయానంద్ విజయకుమార్, గార్లపాటి-బొల్లేపల్లి ట్రస్ట్ నిర్వాహకులు రామకృష్ణ, మధుసూదన రాజు, సృజన నిర్వాహకులు రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు తదితరులు ప్రశంసించారు.






