వేములవాడ నియోజకవర్గంలో మార్పుకు నాంది పలుకుతున్న డా. చెన్నమనేని వికాస్ సేవలు
24-06-2026 12:23 AM
వేములవాడ, జూన్ 23,(విజయక్రాంతి)వేములవాడ నియోజకవర్గంలో డా. చెన్నమనేని వికాస్ ప్రజా సంక్షేమం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటివరకు 30 శుద్ధ జల కేంద్రాలను ఏర్పాటు చేసి వేలాది కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించారు. అత్యవసర వైద్య సేవల కోసం 12 అంబులెన్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు.మహిళల ఆర్థిక సాధికారత కోసం 600 కుట్లు మిషన్లను పంపిణీ చేసి స్వయం ఉపాధికి ప్రోత్సాహం అందించారు.
ఇదే క్రమంలో ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో గంగిరెద్దుల కాలనీలో ఏర్పాటు చేసిన 31వ శుద్ధ జల కేంద్రాన్ని బుధవారం డా. చెన్నమనేని వికాస్ ప్రారంభించనున్నారు.ప్రజల ఆరోగ్యం, ఉపాధి, సంక్షేమమే లక్ష్యంగా ఆయన చేపడుతున్న కార్యక్రమాలు నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడుతున్నాయి.






