అణగారిన వర్గాల హక్కుల కోసం అంబేద్కర్ స్థాపించిన పోరాట సంస్థ సమత సైనిక్ దళ్
ఘట్ కేసర్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలో ఆదివారం ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 261వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్టేట్ ఆర్గనైజర్, సమతా సైనిక్ దళ్, తెలంగాణ మహేంద్ర జాదవ్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమతా సైనిక్ దళ్ అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుమారు 99 సంవత్సరాల క్రితం స్థాపించిన పోరాట సంస్థ. అణగారిన వర్గాలు తమ హక్కుల కోసం సంఘటితం కావాలని, స్వాభిమానంతో నిలబడాలని ఈ సంస్థ ఏర్పడిందన్నారు. అంబేద్కర్ ఉద్యమాలకు బలంగా నిలిచి, సమానత్వం కోసం క్రమశిక్షణతో పోరాడిన దళం ఇదే అని తెలిపారు. ఇప్పటికీ సమతా సైనిక్ దళ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ యువతకు స్పూర్తిగా నిలుస్తోందన్నారు.
అంబేద్కర్ అంబెడ్కర్ కోసం చేసే ప్రతి కార్యక్రమం లో మాసహాయ సహకారాలు అందిస్తాం అని తెలియజేశారు. ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలని చైతన్య పరుస్తున్న మీసాల అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమం లో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేకల దాసు, నాయకులు కె. నర్సింగ్ రావు, కె. సత్యం, బండారి రాందాస్, బాలాజీ, మేకల నర్సింగ్ రావు, మీసాల రాజేష్ కుమార్, ఎ. క్రాంతికుమార్, రోహన్ బోధి కదమ్, విద్యవర్ధన్ వాఘమారే, గౌతమ్ థోరట్, బాలాజీ సోనకంబ్లే, భీమా మోడ్కే, సి. ఆనంద్, ప్రొఫెసర్ సోన్కాంబ్లే, విట్టల్ దుర్గే, చంద్రకాంత్ దుర్గే, ఆకాష్ గైక్వాడ్, కె. దినేష్ కుమార్ పాల్గొన్నారు.




