తెలంగాణ ప్రభుత్వానికి ట్రంప్ కృతజ్ఞతలు
27-06-2026 12:51 PM
హైదరాబాద్‌లో డొనాల్డ్ ట్రంప్ పేరుతో రహదారి
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) పేరుతో హైదరాబాద్‌లోని యు.ఎస్. కాన్సులేట్ సమీప రహదారికి నామకరణం చేయడంపై ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా స్వాతంత్య్రానికి 250 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఫ్రీడమ్ 250 కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రహదారి పేరు ఫలకాన్ని ఆవిష్కరించగా, ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోను ట్రంప్ తన అధికారిక ట్రూత్ సోషల్ ఖాతాలో పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు ట్రంప్ కృతజ్ఞతలు చెప్పారు.






