కోదాడలో 'హిట్-అండ్-రన్': బీహార్ కార్మికులు మృతి
హైవే పక్కన మృతదేహాలు.. రోడ్డు ప్రమాదమా..? హత్యా? పోలీసుల దర్యాప్తు
కోదాడ: సూర్యాపేట జిల్లా(Suryapet District) కోదాడ మండలం శ్రీరంగపురంలో శనివారం జరిగిన 'హిట్ అండ్ రన్'( hit-and-run) ప్రమాదంలో ఇద్దరు రైస్ మిల్లు కార్మికులు మరణించారు. హైవే పక్కన అనుమానస్పందంగా ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. మృతులను బీహార్‌కు చెందిన రాజేష్, శివాజీగా గుర్తించారు. వీళ్లు స్థానిక రైస్ మిల్లులో పనిచేస్తున్నారు. స్థానికులు వారిని రోడ్డు పక్కన మరణించి ఉండగా గుర్తించారు. అలాగే వారి మోటార్‌సైకిల్ కూడా అక్కడే కనిపించింది. ఇది 'హిట్ అండ్ రన్' (ఢీకొట్టి పారిపోయే) ఘటనలో జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న కోదాడ రూరల్ పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం ఇద్దరి మృతదేహాలను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. రోడ్డు ప్రమాదమా లేదా.. హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






