19 August, 2026 | 1:04 AM

సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ త్యాగం నేటి తరానికి ఆదర్శం

19-08-2026 12:00 AM

ఆళ్ళపల్లి, ఆగస్టు 18, (విజయక్రాంతి): సర్దార్ సర్వాయి పాపన్న 376 జయంతిని పురస్కరించుకొని మండల వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గౌడ సంఘ పెద్దలు తాళ్ళపల్లి వెంకన్న, శ్రీరామ్ సమ్మయ్య, యాసరపు బాబు, కోరుకుప్పల రాజన్న మాట్లాడుతూ..

ర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొగల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ గడ్డపై స్వయంపాలన సాధించిన మొదటి వీరుడని, ఆయన త్యాగాలు నేటి తరానికి ఆదర్శమని వక్తలు కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని ఈ సందర్భంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో రేసు ఎల్లయ్య, దీకొండ మల్లేష్, రేసు రాము, రెడ్డిమల్ల రాజు, శ్రీరామ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు