గొప్ప ప్రజా యోధుడు పాపన్నగౌడ్
- జనగామ జిల్లాకు ఆయన పేరు పెట్టాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి) : జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలను గుర్తి స్తూ జనగామ జిల్లాకు ఆయన పేరు పెడతామని కాంగ్రెస్ పార్టీ తన 2023 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావొస్తున్నా ఆ హామీపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. బీజేపీ కార్యాలయంలో సర్దార్ సర్వా యి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను నిర్వహించగా,
మాజీ గవర్నర్ బండా రు దత్తాత్రేయ, ఎంపీ ఈటల రాజేందర్ , ఎమ్మెల్సీ మల్క కొమురయ్య , బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్.గౌతం రావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ తదిరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ స ర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడిన గొప్ప ప్రజా యోధుడు. ఆనాటి సామాజిక అన్యాయా లు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి, సా మాన్య ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేసిన ధీరుడని కొనియాడా రు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జ్ఞాప కార్థం ఆయన జన్మస్థలంలో తగిన స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.






