19 August, 2026 | 2:02 AM

తీసుకున్న అప్పు తిరిగివ్వాల్సి వస్తుందని..

19-08-2026 12:00 AM

ప్రియురాలి హత్య

నాగర్‌కర్నూల్, ఆగస్టు 18 (విజయక్రాంతి): తాడూర్ పీఎస్ పరిధిలో ఈ నెల 15న జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాకొండకు చెందిన నాగి బంగారమ్మ (43)ను తాడూర్‌కు చెందిన భీమయ్య (38) హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బంగారమ్మ, భీమయ్యకు నాలుగేళ్లుగా పరిచయం ఉంది. బంగారమ్మ పొలం విక్రయించిన సమయంలో భీమయ్య కొంత నగదు అప్పుగా తీసుకున్నాడు.

ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని బంగారమ్మ ఒత్తిడి చేయడంతో ఆమెను హత్య చేయాలని భీమయ్య పథకం వేసినట్లు తెలిపారు. ఆగస్టు 15న డబ్బుల విషయమై మాట్లాడేందుకు బంగారమ్మను తన పొలం వద్దకు పి లిచాడు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగగా, సాయంత్రం బొలెరో వాహనంతో ఆమె ను ఢీకొట్టి, రెండుసార్లు ఆమె మీదుగా నడపడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు.

దర్యాప్తులో నిందితుడు భీమయ్యను ఆగస్టు 18న అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి బొలెరో వాహనం, మొబైల్ఫోన్, మృతురాలికి చెందిన బస్ టికెట్లు, ఆధార్ కార్డు, చేతి సంచిని స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు, సీఐ అశోక్రెడ్డి, ఎస్‌ఐ రాములు, కానిస్టేబుల్ రమేష్తో పాటు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.