13 March, 2026 | 9:01 PM

త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనలో పోలీస్ శాఖ పాత్ర కీలకం

13-03-2026 12:48 AM
  1. ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంలోకి తీసుకురండి
  2. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి రేర్‌పై దృష్టి సారించండి 
  3. ప్రీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
  4.   41 జీసీసీలతో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానం
  5. ఐటీ శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): తెలంగాణ నాటికి త్రీ ట్రిలి యన్ డాలర్ ఎకానమీ సాధించడమే లక్ష్యం గా ముందుకు పోతున్నామని, ఈ లక్ష్యసాధనలో పోలీస్ శాఖ పాత్ర కీలకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో హోంశాఖ, పరిశ్రమలు, ఐటీ శాఖల ప్రీ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆయా శాఖల ఉన్నతాధికారులతో భట్టి స మాశం నిర్వహించారు.

ఈ సందర్భంగా భ ట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులకు పెట్టుబడిదారులు వస్తున్న నేపథ్యంలో శాం తిభద్రతలు కీలకమన్నారు. విధుల నిర్వహణ క్రమంలో హోంశాఖకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. పోలీస్ శాఖలో దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)వినియోగాన్ని పెంచా లని సూచించారు.

నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర గణనీయంగా ఉంటుందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సీసీ కెమెరాల వినియోగాన్ని పెద్ద సంఖ్యలో చేపట్టాలని, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అవసరమైన సహకారా న్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపా రు.

2047 త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా లక్ష సాధనలో పబ్లిక్, ప్రైవేట్ (పీపీ )మోడల్ అనివార్యమని ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని పరిశ్రమల శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. క్యూర్, ప్యూర్‌తో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి రేర్ (రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ) సమ ప్రాధాన్యత ఇవ్వాలని డిప్యూటీ సీఎం సూచించారు. 

ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాలి: దుద్దిళ్ల

మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీస్ (ఎంఎస్‌ఎంఈ)లను పెద్ద ఎత్తున ప్రోత్సహించా లనేది ప్రజా ప్రభుత్వం ఆలోచన అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. వీూవీజు ల ద్వారా రాష్ట్ర నలుమూలలోని యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధితో పాటు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉన్న రంగం వీూవీజు అని తెలిపారు.

41 జీసీసీలతో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, ఇదే వేగాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వ నుంచి ప్రోత్సాహం కల్పిస్తామని అన్నారు. డాటా సెంటర్లలో ఏఐ వినియోగాన్నిపెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. సీఎస్ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీవీ ఆనం ద్, టీజీఐఐసీసీ ఎండీ శశాంక, డిప్యూటీ సీ ఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.