బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు అలసిపోదు
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
సికింద్రాబాద్, మే 2 (విజయక్రాంతి): తెలంగాణలో అధికారంలోకి వచ్చేంతవరకు బీజేపీ అలసిపోదు అన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ప్రధాని మీటింగ్‌కి మల్కాజిగిరి పార్లమెంటు నుండి లక్ష మంది హాజరుకాబోతున్నారు. కంటోన్మెంట్ గాయత్రి గార్డెన్‌లో ఈటల రాజేందర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయడానికి మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో నిన్న ఎనిమిది మీటింగులు తెలియజేస్తూ, అన్ని గేటెడ్ కమ్యూనిటీలు,కాలనీలు, బస్తీలు, అపార్ట్‌మెంట్‌లో ఉన్న వారందరినీ కలిసి ఆహ్వానిస్తున్నాం.
ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా 365 రోజులు ప్రజలకు సేవ చేసే వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ. అలాంటి వ్యక్తిని ఆశీర్వదించండి అని తెలంగాణ ప్రజలను కోరుతున్నాము. ఈ సమావేశంలో నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికా ర్జున్ తదితరులు పాల్గొన్నారు.






