ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి కీలకం
27-07-2026 02:35 AM
మాజీ మంత్రి సింగిడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి టౌన్, జూలై 26: అర్హులైన ప్రతి ఓటరు పేరు తుది ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం వనపర్తి పట్టణంలోని 9వ వార్డులో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పరిశీలించిన ఆయన, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలకు పలు సూచనలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఓటు హక్కు కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు తుది జాబితాలో నమోదు కావాలని ఆయన అన్నారు.






