23 April, 2026 | 3:42 AM

అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలి

23-04-2026 12:47 AM
  1. 58వ డివిజన్ పరిధిలో 72 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన 
  2. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 

హనుమకొండ టౌన్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం 58వ డివిజన్ పరిధిలో 72 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, రోడ్డు విస్తరణ పనులకు నగర మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్ ఇమ్మడి లోహిత రాజు లతో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవసరమని, పనులను నిర్ణీత కడువులో పూర్తయ్యేలా కాంట్రాక్టర్లు, అధికారులతో సమన్వయం చేసుకోవాలని, ఇప్పటికే సుమారు  80 శాతం రోడ్డు పనులు పూర్తయ్యాయని, త్వరలో 100 శాతం అంతర్గత రోడ్లు, సిసి డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజల అవసరాల దృష్టిలో ఉంచుకొని ఏబీసీ కేటగిరీల ప్రకారం అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. అంబేద్కర్ విగ్రహం జంక్షన్ నుంచి వడ్డేపల్లి చర్చి వరకు 18 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ, జంక్షన్ల సుందరీ కరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని, మెరుగైన మౌలిక సదుపాయాలకు, ఈ పనులు దోహదం చేస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు, డివిజన్ అధ్యక్షులు తాళ్లపల్లి సుధాకర్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎం.డి నేహాల్, ఫిషరీస్ స్టేట్ డైరెక్టర్ మండల సమ్మయ్య, ఐఎన్టిసియు జిల్లా మాజీ అధ్యక్షులు ఖరాబ్ రాజేశ్వరరావు, కాంగ్రెస్ శ్రేణులు బంక సంపత్ యాదవ్, తాళ్లపల్లి విజయ్, తాళ్లపల్లి రవీందర్ (జె.కె), మేరీ, ఇల్లందుల భాస్కర్, జనగాం శ్రీనివాస్ గౌడ్, బుస్సా నవీన్ కుమార్, మట్టపల్లి కమల్ కుమార్, ఎం.డి సాజిద్, తాళ్లపల్లి ప్రసన్న కుమార్, లలితమ్మ, కవిత, అధికారులు ఈఈ రవికు మార్, డిఈ లు రాజ్ కుమార్, సారంగం, కాలనీవాసులు, ప్రజలు పాల్గొన్నారు.