5 July, 2026 | 1:33 AM

నేడు కన్నేపల్లి పంప్ హౌస్‌కు కేటీఆర్

05-07-2026 12:00 AM

వృథాగా పోతున్న జలాలు, ప్రాజెక్టు నిర్వహణపై పరిశీలన

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ ప్రతినిధుల బృందం ఆదివారం మంథని నియోజకవర్గంలోని కన్నేపల్లి పంప్ హౌస్‌ను సందర్శించనుంది. అక్కడ వృథాగా పోతున్న జలాలను ప్రత్యక్షంగా పరిశీలించి, ప్రాజెక్టు నిర్వహణను పరిశీలించనున్నారు. వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాల పార్టీ సీనియర్ నాయకులు కూడా పాల్గొననున్నారు.