23 April, 2026 | 2:03 AM

విచారణ నివేదికలపై రాజకీయ లక్ష్యాలా?

23-04-2026 12:46 AM
  1. కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టు వ్యాఖ్యలతో రాష్ట్రవ్యాప్త చర్చ
  2. కమిషన్ల పారదర్శకత, నిష్పాక్ష విచారణపై సందేహాలు
  3. రాజకీయ ప్రయోజనాల కోసమేనా విమర్శలు
  4. వాస్తవాలు ప్రజలకు చేరడం లేదనే ఆందోళనలు
  5. కమిషన్ నివేదికపై న్యాయపరమైన సమీక్ష అవసరమంటున్న నిపుణులు
  6. విచారణ అమలులో కఠిన మార్గదర్శకాలు పాటించాలని సూచన

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తాజాగా హైకోర్టు తీర్పు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావుకు హైకోర్టు ఇచ్చిన ఊరట ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమే అయినా, నివేదిక తయారీలో సరైన విధానాలు పాటించలేదని హైకోర్టు వ్యాఖ్యానించ డం గమనార్హం. ముఖ్యంగా సెక్షన్ 8బీ, 8సీ ప్రకారం నోటీసులు ఇవ్వకుండా వ్యక్తులపై ఆరోపణలు చేయడం తగదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కమిషన్‌ను నియమించిందా అనే సందేహాలు ప్రజల్లో బలపడుతున్నాయి.

ఇది లా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రజల్లో అనుమానాలు సృష్టించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కమిషన్‌ను ఆయుధంగా ఉపయోగించిందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తూ వస్తోంది. తాజాగా హైకోర్టు వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్ ఆరోపణలకు మరింత బలం చేకూరింది. కోర్టు వ్యాఖ్యలతో కాంగ్రెస్ ప్రయత్నాలకు గట్టిదెబ్బ తగిలిందని విశ్లేషకులు అంటున్నారు.

సాక్షులుగా వివరాలు సేకరించి, తర్వాత అదే వ్యక్తు లపై ఆరోపణలు మోపడం న్యాయపరంగా తప్పని కోర్టు చెప్పడం కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇక మాజీ సీఎస్ ఎస్‌కే జోషీ, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు కూడా ఊరట లభించడం, ఈ వ్యవహారం కేవలం రాజకీయ లక్ష్యం తో నడిపించారనే అనుమానాలు రేకెత్తుతు న్నాయి. మొత్తంగా హైకోర్టు తీర్పు కాపీ ఇంకా బహిర్గతం కానప్పటికీ ఈ పరిణామం బీఆర్‌ఎస్‌కు రాజకీయంగా భారీ ఊతమిచ్చినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

కాలాయాపనేనా?..

తాజా పరిణామాల నేపథ్యంలో అవినీతి ఆరోపణలపై కమిషన్ల ఏర్పాటు అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. కాళేశ్వరం అంశంలో హైకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు కమిషన్ ఏర్పాటు నిజంగా విచారణ కోసమేనా? లేక కాలయాపనకేనా? అనే ప్రశ్న రాజకీయ వర్గా ల్లో, ప్రజల్లో వినిపిస్తోంది. కమిషన్స్ ఆఫ్ ఎంక్వైయిరీ యాక్టు-1952 ప్రకారం ప్రభుత్వాలు కీలక అంశాలపై వాస్తవాలను బహి ర్గతం చేసేందుకు కమిషన్‌లను ఏర్పాటు చేస్తారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో ఈ కమిషన్ల పనితీరుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

విచారణలు ఏళ్ల తరబడి కొనసాగ డం, నివేదికలు ఆలస్యంగా రావడం, వచ్చినా అమలు జరగకపోవడం వంటి అంశాలు విమర్శలకు దారి తీస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వ్యవహారంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత బలం చేకూర్చుతున్నాయి. ముఖ్యం గా విచారణలో విధివిధానాలు సక్రమంగా పాటించలేదని కోర్టు అభిప్రాయపడటం, నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరైంది కాదని పేర్కొనడం వంటివి కమిషన్ నిష్పాక్ష విచారణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

అయితే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వా లు ప్రజల నుంచి వచ్చే ఒత్తిడిని తగ్గించేందుకు లేదా వివాదాస్పద అంశాలను కాలం గడపడానికి కమిషన్లను ఏర్పాటు చేస్తాయని, విచా రణ జరుగుతుందనే భావన కల్పిస్తూ, అసలు నిర్ణయాలను వాయిదా వేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతోపాటు సరైన విధంగా విచారణ చేపడితే కీలకమైన ఆధారాలను బయటపెట్టి పాలనలో పారదర్శకత పెంచే అవకాశం కూడా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి కమిషన్ల ఏర్పాటు ఉద్దేశం గొప్పదే అయినా, అమలు విధానంపై ఆధారపడి వాటి ప్రభావం మారుతోంది.

రాజకీయ ప్రయోజనాల మధ్య ప్రజలకు వాస్తవాలు తెలిసేదెలా?

కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో విచారణ కమిషన్ల వ్యవస్థపై మరోసారి రాజకీయ విమర్శలు పెరుగు తున్నాయి. అవినీతి ఆరోపణలపై పారదర్శకంగా దర్యాప్తు జరిపి నిజాలు వెలికితీసే బాధ్య త నిర్వర్తించడానికే వాస్తవానికి కమిషన్లను ఏర్పాటు ముఖ్య ఉద్దేశం. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈ వ్యవస్థను ప్రభుత్వాలు తమకు అనుకూలంగా ఉపయోగిస్తు న్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రతిపక్షాలపై ఒత్తిడి తీసుకురావడం, వివాదాస్పద అంశాలను ప్రజల దృష్టిలో ఉంచడం, లేదా తక్షణ నిర్ణయాల నుంచి తప్పించుకోవడం కోసం కమిషన్లను ఉపయోగిస్తున్నారనే అభిప్రాయాలు విశ్లేషకుల నుంచి వెలువడు తున్నాయి. విచారణ పేరుతో సమయం గడిపి, తర్వాత నివేదికలను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాళేశ్వరం కేసులో కమిషన్ విధివిధానాలపై హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేయడం కూడా ఈ వాదనలకు బలం చేకూర్చింది.

నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరైంది కాదని కోర్టు వ్యాఖ్యానించడం కమిషన్ల పనితీరుపై నమ్మకాన్ని దెబ్బతీస్తోందని విమర్శకులు అంటు న్నారు. కమిషన్లు ఒక న్యాయపరమైన వ్యవస్థ అయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ వాస్తవాల్లో అవి ఎక్కువగా రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది. 

ఈ నేపథ్యంలో అవినీతి ఆరోపణలపై ప్రజలకు అసలు వాస్తవాలు ఎలా తెలుస్తాయనే ప్రశ్న కీలకంగా మారింది. నిజంగా ప్రజలకు వాస్తవాలు చేరాలంటే కమిషన్ ఏర్పాటుతోపాటు విచారణ ప్రక్రియ పారదర్శకంగా ఉండాల్సిందేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు నిజాలు చేరడానికి కొన్ని కీలక మార్గాలు అవసరమని విశ్లేషకులు సూచిస్తున్నారు.

విచారణ సమయంలో సాక్షుల వాంగ్మూలాలు, ఆధారాలు ఎంతవరకు ప్రజలకు అం దుబాటులో ఉంటాయన్నది ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. చాలా సందర్భా   ల్లో నివేదికలు గోప్యంగా ఉంచడం లేదా ఆలస్యంగా విడుదల చేయడం వల్ల అనుమా నాలు పెరుగుతున్నాయి. 

పనీతీరు, పారదర్శకతపై ప్రశ్నలెన్నో..!

కాళేశ్వరం అంశంలో హైకోర్టు తీర్పు తర్వాత విచారణ కమిషన్ల పనితీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని స్పష్టం చేసిన కోర్టు, నివేదిక తయారీ విధానంపై వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారాయి. దీంతో కమిషన్ల పనితీరులో పారదర్శకత, నిష్పక్షపాతంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ కమిషన్లు నిజాలను వెలికితీయడానికి కీలకమైనవే అయినప్పటికీ, విధివిధానాలు సక్రమంగా పాటించకపోతే అవే వివాదాలకు కారణమవుతాయని నిపుణులు అభిప్రాయపడు తున్నారు.

ఈ తీర్పుతో కమిషన్లు ఎలా పనిచేయాలి, ఎలాంటి న్యాయ ప్రమాణాలు పాటించాలి అన్నదానిపై స్పష్టత అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమిషన్ నివేదికలపై న్యాయపరమైన సమీ క్ష కూడా కీలకంగా మారుతుంది. కోర్టులు జోక్యం చేసుకున్నప్పుడు మాత్రమే కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్న అభిప్రాయం ఉంది. రాజకీయ ప్రభావం లేకుండా కమిషన్లు పని చేయాలంటే వాటి నియామకం నుంచి నివేదిక అమలు వరకు స్పష్టమైన నియమాలు, గడువులు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

లేకపోతే కమిషన్లు కేవలం రాజకీయ సాధనాలుగా మిగిలిపోతాయని హెచ్చరిస్తున్నారు. అయి తే తాజా పరిణామాలు కమిషన్లను రాజకీ య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలకు ఈ తీర్పు బలం చేకూ ర్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. విచారణ పేరుతో వ్యక్తుల ప్రతిష్ఠ దెబ్బతీయడం సరికాదని కోర్టు సూచించడంతో, భవిష్యత్‌లో కమిషన్ల వ్యవస్థపై మరింత కఠిన నియంత్రణలు అవసరమన్న డిమాం డ్లు వినిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పు కేవలం ఒక కేసుకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తం గా విచారణ కమిషన్ల పనితీరుపై పెద్దఎత్తున చర్చకు దారి తీసింది.