5 July, 2026 | 2:23 AM

ఉప్పొంగిన ఒర్రె..

05-07-2026 12:46 AM
  1. స్తంభించిన రాకపోకలు
  2. 12 గ్రామాల గిరిజన ప్రజలకు ఒర్రెలు అడ్డు  

బెజ్జూర్, జూలై 4 (విజయక్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని సుస్మిర్ ఒర్రెలు ఉప్పొంగడంతో 12 గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఏటా గిరిజన ప్రజలు తంటాలు పడుతూ గడపాల్సిన పరిస్థితి. రెండు ఒర్రెలు ఉప్పొంగితే ప్రజలు ఎటు వెళ్లలేని పరిస్థితిగా మారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అధికారు లు హామీలు ఇస్తున్నారు తప్ప మారుమూల ప్రాంతాల గిరిజన ప్రజల సమస్యలు పరిష్కా రం కావడం లేదని ప్రజలు తెలుపుతున్నారు.

గత సంవత్సరం రోడ్లంతా బురదమయంగా ఉండడంతో పాటు ఒర్రెలు ఉప్పొంగడంతో నిండు గర్భిణి ప్రధాన రహదారిపైనే ప్రసవం అయింది. అటవీ శాఖ అనుమతులు లేక ఇటు రోడ్లు కాక అటు వంతెనలు మంజూరు కాక అభివృద్ధి లేక గిరిజన ప్రజలు ఆమడ దూరం లో ఉంటున్నామని తెలుపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెండు ఒర్రెలపై వంతెనలు మంజూరు చేసి గిరిజన గ్రామాల ప్రజల సమస్య  పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.