డ్రగ్స్‌పై ఉక్కుపాదం
05-07-2026 12:47 AM
రూ.5 కోట్ల విలువైన 833 కిలోల సరుకు దహనం
శేరిలింగంపల్లి,జూలై 4 (విజయక్రాంతి): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 101 ఎన్‌డీపీఎస్ కేసుల్లో పట్టుబడిన రూ.5.02 కోట్ల విలువైన 833.118 కిలోల మాదకద్రవ్యాలను శనివారం దహనం చేశారు. సీపీ ఎం. రమేశ్ ఆదేశాలతో డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైైర్మన్, డీసీపీ ఏ. ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో నందిగామ మండలం ఏదులపల్లిలోని జీజే మల్టీక్లేవ్ సంస్థలో పర్యావరణ నిబంధనల ప్రకారం ఇన్సినరేటర్‌లో ధ్వంసం చేశారు.
ధ్వంసం చేసిన మాదకద్రవ్యాల్లో 797 కిలోల 841గ్రా. గంజాయి, 7.970 కిలోల అల్ప్రజోలం,౧,658గ్రాముల హాషిష్‌ఆయిల్, 24.640 కిలోల గంజాచాక్లెట్లు, 912 గ్రా. గంజామొక్కలు, 92గ్రా. చరస్, 0.005 గ్రా. ఎండీఎంఏ ఉన్నాయి. మొత్తం 7 రకాల డ్రగ్స్‌ను 8వ విడతలో దహనం చేశారు.






