calender_icon.png 21 February, 2026 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ ప్రవచనాలు అనుసరించాలి

21-02-2026 12:19:38 AM

మహారాష్ట్ర పౌరాగడ్ పీఠాధిపతి ధర్మ గురు, బీజేపీ ఎమ్మెల్సీ బాబు సింగ్  మహారాజ్

తాండూరు, ఫిబ్రవరి20 (విజయక్రాంతి): శ్రీ సద్గురు సంత్  సేవాలాల్ ఆశయాలు నెరవేర్చేందుకు ఆయన సూచించిన ప్రవచనాలు పాటిస్తూ...ఆయన అడుగుజాడల్లో నడుస్తూ...ప్రతి ఒక్కరు సన్మార్గంలో నడవాలని మహారాష్ట్ర బంజారాల కాశి గా పిలవబడే పౌరదేవి గడ్ పీఠాధిపతి, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ధర్మ గురు శ్రీ బాబు సింగ్ మహారాజ్ అన్నారు.

శుక్రవారం వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి తండా యాడి బాపూగడ్ దేవస్థానం ధర్మకర్తలు, జాగో బంజారా సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రమావత్ సురేందర్ నాయక్ మహారాజ్, శాంతాదేవిల ఆధ్వర్యంలో సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ 316వ అవతార దినోత్సవం లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న సేవాలాల్ మరియు మరెమ్మ అమ్మవారికి పిండి వంటలతో తయారుచేసిన భోగ్ నైవేద్యం భక్తిశ్రద్ధలతో సమర్పించారు.

ఈ సందర్భంగా బాబు సింగ్ మహారాజ్ మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ బంజారాల చైతన్యం కోసం ఆ కాలంలోనే తండా తండాకు కాలినడకని తిరిగారని ఆయన అడుగుజాడల్లో యువత నడుస్తూ ఆధ్యాత్మికత, భక్తి భావంతో నడుస్తూ ఐక్యంగా ఉండాలని అన్నారు. పౌరాగాడ్ లో విశాలమైన మందిర నిర్మాణం కోసం. సకల సౌకర్యాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 700 కోట్ల రూపాయలు మంజూరు చేశారని అందుకుగాను పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు.

సురేందర్ నాయక్ మహారాజ్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు అంటూ కొంతమంది ఎక్కడపడితే అక్కడ కేకులు కట్ చేయడం సరికాదని అయినా బంజారాల ఆరాధ్యుడని సాంప్రదాయ  బద్దoగా దేవాలయాల్లోనే భోగి నైవేద్యం సమర్పించాలని కోరారు, గత 20 ఏళ్లుగా  యాడి బాపూ గడ్ లో ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

బంజారాల సుఖశాంతుల జీవనం కోసం శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకుగాను ప్రభుత్వమే ఎండోమెంట్ శాఖ ద్వారా ప్రతి తండాలో సేవాలాల్ మరియు మరియమ్మ ఆలయాలు నిర్మించాలని. . నియోజకవర్గస్థాయిలో పది ఎకరాల స్థలంలో విశాలమైన ఆలయ నిర్మాణం చేపట్టాలని కోరారు. అనంతరం ఉత్సవాలకు వచ్చిన వారికి తీర్థప్రసాదాలు అన్నదాన కార్యక్రమాన్ని భారీగా నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో  పెద్దముల్ మాజీ వైస్ ఎంపీపీ మధులత ,నల్గొండ జిల్లా బొమ్మలరామారం మాజీ సర్పంచ్ పాండు నాయక్ వివిధ గ్రామాల బంజారాలు యువతీ, యువకులు, భక్తులు ,ప్రజలు భారీగా పాల్గొన్నారు