14 May, 2026 | 12:02 AM

Breaking News

ఆఖరి మజిలీకి ఎన్ని కష్టాలో..?   •   కోయత్తూరు భాషకు రాజ్యాంగ హోదా కల్పించాలి   •   మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •  

ఘనంగా కింగ్ స్టన్ ఆస్పత్రి 4వ వార్షిక వేడుకలు

21-02-2026 12:21 AM
  1. ఊపిరితిత్తుల ఆరోగ్యం -సంరక్షణ -నివారణపై అవగాహన సదస్సు 

ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటించాలి: మంత్రి  

హైదరాబాద్, ఫిబ్రవరి 20(విజయక్రాం తి): ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెం పొందించుకొని, ఆరోగ్య సూత్రాలను పాటి స్తూ, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి అజరుద్దీన్ పేర్కొన్నారు.శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని కింగ్‌స్ట న్ ఆస్పత్రి 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఆడిటోరియంలో ఊపిరితిత్తుల ఆరోగ్యం- సం రక్షణ- నివారణ (ఇన్‌స్పైర్)పై అవగాహన సద స్సు నిర్వహించారు.

మంత్రి అజారుద్దీన్, తారే క్ అన్సారి, డాక్టర్ ఆశిష్ చౌహాన్, క్రిటికల్ కేర్ స్పెషలిస్టు, మెడికల్ డైరెక్టర్, డాక్టర్ మహమ్మద్ పైసల్, రేవరెండ, బ్రదర్ జాన్, ప్రఖ్యాత ఆర్థికవేత్త, డాక్టర్ అమీరుల్లాలు, ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అజరుద్దీన్ మాట్లాడుతూ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, వాటి వల్ల శరీరంలో ఇతర అవయవాలకు, పొంచి ఉన్న, ప్రమాదాలపై, రోగులకు అవగాహన  కల్పించేందుకు కింగ్‌స్టన్ ఆస్పత్రి ముందుకు రావ డం సంతోషకర విషయమన్నారు.

ప్రతి ఒక్క రూ నిజజీవితంలో తమ శరీరంలో అత్యంత కీలకమైన, సున్నితమైన ఊపిరితిత్తులను నిర్లక్ష్యం చేయకుండా తమకు తామే సంరక్షించుకోవాలని ఆయన సూచించారు. శారీరిక శ్రమతో పాటు, ప్రతి ఒక్కరూ, ప్రతిరోజు సుమారు అరగంట పాటు, వ్యాయామం చేయాలని ఆయన తెలిపారు. అలాగే ఆరోగ్యకరమైన, ఊపిరితిత్తుల సంరక్షణ, కోసం  ప్రతి ఒక్కరూ, ధూమపానానికి దూరంగా ఉండాలని ఆయన సందర్భంగా గుర్తు చేశారు. 

కింగ్‌స్టన్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్  డాక్టర్ మహ్మద్ పైసల్ మాట్లాడుతూ తమ ఆస్పత్రి ఆధ్వర్యంలో, కమ్యూనిటీ స్కీనింగ్ క్యాంపు లు, సిపిఆర్ పై శిక్షణ, వర్క్ షాపులు, పాఠశాల కళాశాల విద్యార్థులకు,

ఊపిరితిత్తుల సంరక్షణపైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. తమ ఆస్పత్రి 4వ వార్షికోత్సవం సందర్భం గా ఊపిరితిత్తుల ఇన్‌స్పైర్ కార్యక్రమం నిర్వహించడం, ఎంతో ఆనందంగా ఉందన్నారు, ఈ కార్యక్రమంలో, కింగ్‌స్టన్ ఆస్పత్రి వైద్యు లు, సిబ్బంది పాల్గొన్నారు.