30 May, 2026 | 3:33 AM

కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లుల తరలించాలి

30-05-2026 12:00 AM

కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, మే 29 (విజయక్రాంతి): కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ సూచించారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బిబిపేట మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, రైస్ మిల్లులలో ధాన్యం నిలువల ను పరిశీలించారు. సంబంధిత కొనుగోలు కేంద్రాల నిర్వహకులతోపాటు, రైస్ మిల్లుల యజమానులతో మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యం నాణ్యత తూకం, విధానం, హమాలీల సౌకర్యాలు, రవాణా ఏర్పాట్లపై ఆరా తీశారు. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ లు, అవసరమైన రక్షణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగవంతంగా కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రంలో దాన్యం నిలువ విధానం, ఆన్లైన్ నమోదు, టోకెన్ వ్యవస్థ, చెల్లింపుల వివరాలను పరిశీలించిన కలెక్టర్ ప్రభుత్వ మార్గ దర్శకాల ప్రకారం పారదర్శకంగా కొనుగోలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. రైతులు తీసుకొచ్చిన ప్రతి ధాన్యం గింజకు సరైన మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై డిఎం శ్రీకాంత్, డిసిఓ రామ్మోహన్, సంబంధిత శాఖల అధికారులు, కొనుగోలు కేంద్ర సిబ్బంది  పాల్గొన్నారు.