30 May, 2026 | 4:21 AM

పంట పొలాల్లో చెలరేగిన మంటలు

30-05-2026 12:01 AM

జగిత్యాల, మే 29 ( విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాల గ్రామ శివారు పంట పొలాలలో గడ్డి కోయల్లో ఆకస్మిక మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించటం తో స్థానికులు ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తేవటానికి తీవ్రంగా శ్రమించారు 10 ఎకరాల వరకు మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారని రైతులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.