28 July, 2026 | 2:16 AM

తెలంగాణ ఉద్యమ కారుల గుర్తింపు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి

28-07-2026 01:24 AM

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డా. చీమ శ్రీనివాస్

ముషీరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమ కారుల గుర్తింపు ప్రక్రియను ఇకపై కాలయాపన చేయకుండా వెంటనే ప్రారంభించాలని తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డా. చీమ శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు పూర్తయినా ఉద్యమ కారుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ చరిత్ర, జైలు శిక్షలు, ఎఫ్‌ఐఆర్లు, బైండోవర్ కేసులు, ప్రెస్ నోట్లు, ఫొటోలు వంటి ఆధారాలతో అర్హులను గుర్తించి వెంటనే గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు.  ఈ సమావేశంలో గుండు దయానంద్, బి. జగన్ యాదవ్, జోగు అంజయ్య, మోకే ప్రసాద్, లక్ష్మీనారాయణ, రాజేష్, కొండా స్వామి, శివకుమార్ నేత, రాజేందర్, శ్యామల, మంజూష, అనంత లక్ష్మి, నాగజ్యోతి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.