మాంగ్ సమాజ్ సమస్యలు పరిష్కరించాలి
24-06-2026 05:13 PM
ఎమ్మెల్యేలకు దత్తా మాంగ్ వినతి
జైనూర్, జూన్ 25 (విజయ క్రాంతి): ఏజెన్సీలో నివసిస్తున్న మాంగ్ సమాజ్ ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా అధ్యక్షుడు మొహాలే దత్తా మాంగ్ బుధవారం ఎమ్మెల్యేలకు వినతిపత్రం అందజేశారు.ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా భోజ్జు పటేల్‌లను కలిసి మాంగ్ సమాజ్ డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.ఏజెన్సీలో భూపట్టాలు, పహాణీలు, నకళ్లు మంజూరు చేయాలని, అర్హులకు పంట రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని, మాంగ్ పిల్లలకు గురుకులాలు, స్కూళ్లలో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి తమకు న్యాయం చేయాలని దత్తా మాంగ్ కోరారు.






