24 June, 2026 | 6:04 PM

యువ నాయకత్వాన్ని ప్రోత్సహించండి

24-06-2026 05:12 PM

బోథ్ . జూన్ 24 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీలో యువ నాయకత్వాన్ని మరింతగా ప్రోత్సహించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నరేష్ జాదవ్ కోరారు. బుధవారం మండలంలోని పొచ్చెర గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శమిందర్ రెడ్డి ని ఆయన జన్మదిన సందర్భంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని నిరాశ పడకుండా పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన సూచించారు పార్టీ కోసం కష్టపడ్డ వారికి మంచి ఫలితం ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బూర్గుల మల్లేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ.  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్ర పూల్ చందర్ రెడ్డి తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు