1 August, 2026 | 2:57 AM

వర్షపు నీటి నిల్వ సమస్య పరిష్కరించాలి

01-08-2026 02:07 AM

గజ్వేల్, జులై 31: ప్రజా సమస్యల పరిష్కారమే భారతీయ జనతా పార్టీ ధ్యేయమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. గజ్వేల్‌ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డు తూప్రాన్ రోడ్డు, హెచ్పీ పెట్రోల్ బంక్ వెనుక ఉన్న కాలనీలో ప్రతి సంవత్సరం వర్షపు నీరు నిలిచిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతూ జీపీపీ మున్సిపల్ 15వ వార్డు బీజేపీ నాయకుడు జోడు ప్రకాష్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు, మున్సిపల్ చైర్మన్కు వినతిపత్రం అందజేశారు.

ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులు కోరారు. త్వరలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్, బీజేపీ ఎస్సీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నత్తి శివకుమార్, గజ్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి నాయిని సందీప్ కుమార్, సీనియర్ నాయకులు వెంకటేష్, గడియారం రాజేశ్వర్ చారి తదితరులు పాల్గొన్నారు.