1 August, 2026 | 3:59 AM

కుల దురహంకరణ సమాజానికి సవాళ్లు

01-08-2026 02:08 AM

చేగుంట, జూలై 31 : చేగుంట మండలంలోని బోనాల  గ్రామంలో శుక్రవారం  చేగుంట తహసిల్దార్ బల్ లక్మి ఆదేశాల మేరకు,కార్యాలయం సినియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, చేగుంట ఎస్ ఐ 2,బిక్య నాయక్,సర్పంచ్  ఎర్రగొల్ల సుకన్య నాగులు ఆధ్వర్యంలో బోనాల గ్రామంలో సివిల్ రైట్స్   డే నిర్వహించారు, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, ఎస్సీ కులస్తులను కులం  పేరుతో దూషించిన, గుడిలో రాకుండా అడ్డుపడిన, వారి పైన, ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ కేస్ కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందన్నారు,

గ్రామంలో ఎవరైనా కులాంతర వివాహం చేసుకున్నట్లయితే వారికి ప్రభుత్వం తరుపున 50 వేల రూపాయలు నగదు., విదేశీ చదువుల. కొరకు రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది, అన్నారు, ఈ కార్యక్రమం లో గ్రామ సెక్రెటరీ మౌనిక , గ్రామ రెవిన్యూ ఆఫీసర్, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు,